బ్రేకప్‌తో మంచే జరిగింది.. నా పెళ్లి అలా జరగాలి: కంగనా | Kangana Ranaut Opens Up About Her Marriage Plans | Sakshi
Sakshi News home page

Kangana Ranaut : బ్రేకప్‌తో మంచే జరిగింది.. ఐదేళ్ల తర్వాతే పెళ్లి..బట్‌ ఓ కండీషన్‌

Published Sat, Oct 28 2023 1:13 PM | Last Updated on Sat, Oct 28 2023 1:21 PM

Kangana Ranaut Opens Up About Her Marriage Plans - Sakshi

ఎలాంటి విషయాన్ని అయినా కుండలు బద్దలు కొట్టినట్లు చెప్పడం బాలీవుడ్ హీరోయిన్‌ కంగనా రనౌత్‌కు అలవాటు. కేవలం సినిమా విషయాల్లోనే కాకుండా..రాజకీయ అంశాలపై కూడా ఆమె స్పందిస్తుంటారు. అందుకే కంగనాకు ఫైర్‌బ్రాండ్‌ అనే ముద్ర పడింది. తాజాగా ఈ బాలీవుడ్‌ భామ తన లవ్‌ బ్రేకప్‌ విషయంతో పాటు పెళ్లిపై తనకున్న అభిప్రాయం ఏంటో చెప్పింది. 


 
కంగనా నటించిన తాజా చిత్రం తేజస్‌ అక్టోబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో బ్రేకప్‌ అయిన తన రిలేషన్‌ గురించి చెప్పుకొచ్చింది.  ‘ఎలాంటి సంబంధాలు అయినా ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ప్రేమ విషయంలో అందరూ విజయం సాధించలేరు. నేను కూడా తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడ్డాను. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయాం. బ్రేకప్‌ వల్ల నాకు మంచే జరిగింది. ఒకవేళ నేను ఇప్పటికీ ప్రేమలో ఉన్నట్లయితే.. నా సమయం అంతా దానికే కేటాయించాల్సి వచ్చేది. అదృష్టవశాత్తు నాకు బ్రేకప్‌ జరిగింది. లవ్‌ ఫెయిల్యూర్‌ వల్ల జరిగే లాభాలేంటో చాలా మందికి ఆలస్యంగా తెలుస్తాయి’అని కంగనా చెప్పుకొచ్చింది.

ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘ప్రతి అమ్మాయి తన పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ గురించి కలలు కంటుంది. నేను కూడా కుటుంబ వ్యవస్థలకు గౌరవం ఇస్తాను. పెళ్లి చేసుకోవాలని, నాకంటూ ఓ ఫ్యామిలీ ఉండాలనుకుంటున్నారు. రానున్న ఐదేళ్లలో పెళ్లి చేసుకుంటాను. అయితే అది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అయితేనే చేసుకుంటాను. నా పెళ్లి పెద్దల సమక్షంలో జరగాలని కోరుకుంటున్నాను’అని కంగనా తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement