సిద్ధార్థ్ మంచి వ్యక్తి | What caused the Samantha-Siddharth split? | Sakshi
Sakshi News home page

సిద్ధార్థ్ మంచి వ్యక్తి

Published Sat, Jan 10 2015 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

సిద్ధార్థ్ మంచి వ్యక్తి

సిద్ధార్థ్ మంచి వ్యక్తి

సిద్ధార్థ్, సమంతల మధ్య ప్రేమ బ్రేక్ అప్ అయిందంటూ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అత్తమొత్తినా ఫర్వాలేదుగానీ తోడికోడలు నవ్వినందుకు బాధేసిందంటూ సమంత ట్విట్టర్‌లో మీడియా మండి పడింది. పైగా సిద్ధార్థ్ మంచి వ్యక్తిఅంటూ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది. సిద్ధార్‌‌థ తో ప్రేమ వ్యవహారంలో తాను చాలా బాధపడ్డానని అందరూ అడుగుతున్నారని, అయితే తాను ఎలాంటి బాధ పడలేదని పేర్కొంది.

ఇది తన సొంత విషయమని, ఇకనైనా మీడియా ప్రచారాన్ని ఆపేయాలని కోరింది. సిద్ధార్థ్ మాత్రం ఈ విషయంపై మౌనం వహించడం గమనార్హం. ఇలాంటి పరిస్థితిలో మలయాళ చిత్రం బెంగళూర్ డేస్ తమిళం, తెలుగు భాష రీమేక్‌లో సిద్ధార్థ్, సమంత జంటగా నటించడానికి ఎంపికయ్యారు. ఇప్పుడీ చిత్రంలో వీరిద్దరూ నటిస్తారా? అనే ప్రశ్నకు ఆ చిత్ర వర్గాలు వారి వ్యక్తిగత విషయాలకు ఈ చిత్రంలో నటించడానికి సంబంధం లేదంటున్నాయి.

నిజానికి సిద్ధార్థ్, సమంతలు నెల రోజులకు ముందే ఒకరికొకరు మాట్లాడుకోవడం మానేశారని, అయినా తమ చిత్రంలో వారు నటించడంలో ఎలాంటి మార్పూ లేదని పేర్కొన్నాయి. బెంగళూరు డేస్ చిత్ర రీమేక్‌కు సంబంధించిన ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, అనుకున్నట్లు మార్చిలో ఈ చిత్రం సెట్‌పైకి వెళుతుందని తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement