
తోడు కోరుకోవడం తప్పేం కాదు.. అయితే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) 60 ఏళ్ల వయసులో తోడు కావాలని కోరుకోవడంతో అందరూ నోరెళ్లబెడుతున్నారు. పైగా ఇతడు రెండుసార్లు పెళ్లి చేసుకోగా.. ఇద్దరికీ విడాకులిచ్చేశాడు. విడాకులిచ్చాడన్నమాటే కానీ మాజీ భార్యల్ని సొంత మనుషుల్లా చూసుకుంటాడు. వారితో ఇప్పటికీ స్నేహితుడిగానే మెదులుతాడు.
60 ఏళ్ల వయసులో డేటింగ్
ఇకపోతే మార్చి 14న ఆమిర్ బర్త్‌డే. ఈ రోజు అతడు 60వ పడిలోకి అడుగుపెట్టాడు. రెండు రోజులనుంచి ప్రీబర్త్‌డే సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాను ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టి అందరికీ షాకిచ్చాడు. గౌరి స్ప్రాట్ (Gauri Spratt)ను ప్రేమిస్తున్నట్లు వెల్లడించాడు. ఆమె 25 ఏళ్లుగా తెలుసని, కాకపోతే ఏడాది నుంచే డేటింగ్‌లో ఉన్నామని తెలిపాడు. బెంగళూరులో నివసిస్తున్న గౌరీకి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు.
ప్రేయసి కోసం ముందుజాగ్రత్త
ఆమిర్ ప్రేయసి అనగానే అందరూ ఆమె ఎలా ఉంది? ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్తుంది? అని తనను ఫాలో అవడం ఖాయం. అందుకనే ప్రేయసికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఆమె కోసం ప్రైవేట్ సెక్యురిటీని పెట్టాడు. అలాగే మీడియా ఫాలోయింగ్ ఎలా ఉంటుందో కూడా చెప్పాడట! దీని గురించి ఆమిర్ మాట్లాడుతూ.. ఒక స్టార్ కనిపిస్తే మీడియా ఎలా వారి వెంటపడతారు? ఎలా ఫాలో చేస్తారు? వంటి విషయాలన్నీ తనకు అర్థమయ్యేలా చెప్పాను.
స్పెషల్ డిన్నర్ డేట్
తనకివన్నీ అలవాటు కావడానికి సమయం పడుతుంది. మీరు కాస్త సహకరిస్తారని కోరుకుంటున్నాను. తనకోసం ఇప్పటికే సెక్యూరిటీని కూడా నియమించాను అని చెప్పుకొచ్చాడు. అన్నట్లు ఈరోజు ఆమిర్ బర్త్‌డే కావడంతో డిన్నర్ డేట్ ఏర్పాటు చేసిందట. క్యాండిల్స్, ఫ్లవర్స్ మధ్య వారిద్దరూ విందును ఆస్వాదించనున్నారట!
పర్సనల్ లైఫ్
బాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న ఆమిర్ ఖాన్.. 1986లో రీనా దత్తాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు జునైద్, కూతురు ఐరా ఖాన్ సంతానం. తర్వాత పలు కారణాల వల్ల ఆమిర్ 2002లో రీనాకు విడాకులిచ్చేశాడు. 2005లో డైరెక్టర్ కిరణ్‌రావును పెళ్లి చేసుకున్నాడు. వీరికి సరోగసి ద్వారా ఆజాద్ రావు జన్మించాడు. 2021లో ఈ జంట కూడా విడిపోయారు.
చదవండి: సీక్రెట్ పెళ్లి.. నాలుగు నెలలకే విడాకులు.. స్పందించిన బుల్లితెర నటి
Comments
Please login to add a commentAdd a comment