
ప్రజా చైతన్యం కోసమే ‘గావ్ చలో అభియాన్’
నారాయణపేట రూరల్: ప్రజలను చైతన్యపర్చడం కోసమే గాల్ చలో అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత నాగురావు నామాజీ, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గావ్ చలో ఘార్ చలో అభియాన్ కార్యక్రమం లో భాగంగా మండలంలోని కోటకొండలో వారితోపాటు ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు కెంచే శ్రీనివాసులు బృందం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలను పరిశీలించారు. అదేవిదంగా కొల్లంపల్లి గ్రామంలో జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ పర్యటించి కేంద్రప్రభుత్వ పథకాల పరిశీలనలో భాగంగా ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకన్నారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూలీలను అన్ని రకాలు గా ఆదుకుంటుంది అని భరోసా ఇచ్చారు. ఆయా గ్రామ పాఠశాల మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలల్లోని సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. బీజేపీ ఎమ్మెల్సీల సహకారంతో ఆయా సమస్యల పరిష్కారం చేసేవిధంగా చూస్తామన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి ఇంటింటికీ బిజెపిని చేర్చాలని తద్వారా రానున్న ఎన్నికల్లో బిజెపి గెలుపునకు బాటలు వేయాలని పిలుపు నిచ్చారు. ఆయా కార్యక్రమాలో వెంకట్రాములు, సాయిబన్న, చంద్రశేఖర్, గ్రామ బూత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.