
క్రీడలతో మానసికోల్లాసం
మక్తల్: క్రీడలు దేహ ధారుడ్యానికి, మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని మక్తల్ సిఐ రాంలాల్ అన్నారు. శుక్రవారం మక్తల్‌లో షూటింగ్ బాల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో సబ్ షూటింగ్ బాల్ బాలబాలికలకు ఏర్పాటు చేసిన క్రీడలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు, సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందన్నారు. ఇక్కడి క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిల్లో ఎంపిక అవుతుండడం అభినందనీయమన్నారు. జాతీయ స్థాయిల్లో రాణించిన బాలికలు దివ్య, ప్రవీణ, లక్ష్మి, మేఘన, విశ్వాస, కౌసల్య, గాయత్రి, మధుప్రియ, అఖిల, శ్రావణిని సన్మానం చేశారు. అలాగే, రాష్ట్ర స్థాయికి ఎంపికై న దివ్య, లక్ష్మి, ప్రవీణ, మేఘన, విశ్వాస, కౌసల్య, అఖిల, శ్రావణి, మల్లేశ్వరి, రాజేష్, శివ, జగదీస్, మణికుమార్, మేగేందర్, రహీం, గణేష్, వెంకటేష్‌లను అభినందించారు. ఈ నెల 25 నుంచి 27 వరకు జరుగు రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ పోటీల్లో వీరు పాల్గొంటారని అన్నారు. సత్యఅంజి, బి.గోపాల్, రమేష్‌కుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి, స్వప్న, బీంరెడ్డి, అనిత, రాఘవేందర్ పాల్గొన్నారు.