
బావాజీ ఆలయ హుండీ ఆదాయం రూ.20 లక్షలు
కొత్తపల్లి: దక్షిణ భారతేశంలోనే అతి పెద్ద గిరిజన పుణ్యక్షేత్రం గురులోకా మసంద్ బావాజీ బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా ఆలయంలోని మరో రెండు హుండీలను గురువారం లెక్కించారు. బావాజీ ఆలయ హుండీ ద్వారా రూ.19.8 లక్షలు, హనుమాన్ ఆలయ హుండీ ద్వారా రూ.1.54 లక్షల ఆదాయం వచ్చింది. ఎండోమెంట్, ఎస్‌బీఐ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించా రు. బావాజీ ఆలయంలో మొత్తం మూడు హుండీలు ఉండగా బుధవారం కాళికాదేవి హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ.12.56 లక్షలు వచ్చాయి. మొత్తం మూడు హుండీలు కలిపి రూ.33.19లక్షలు వచ్చాయని ఆలయ ఈఓ కోమాల్ తెలిపారు. హుండీల్లో వేసిన ఆభరణాలు లెక్కించాల్సి ఉందని ఆయన తెలిపారు.
భూ నిర్వాసితులకు అండగా ఉంటాం
ఊట్కూరు: నారాయణపేట–కొండంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం రాత్రి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న దంతన్‌పల్లి రైతులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందించారు. తాము వ్యవసాయ భూములపై ఆధారపడి జీవిస్తున్నామని, భూములు కోల్పోతే కుటుంబం పోషించుకోవడం కష్టతరమవుతుందని వాపోయారు. భూములు కోల్పోయిన రైతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఎకరాకు రూ.30 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు అధిక మొత్తంలో నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తానని, సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని, రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడవద్దని అన్నారు. వినతిపత్రం అందించిన వారిలో రైతులు ఎల్కోటి జనార్దన్‌రెడ్డి, ఎం గోపాల్‌రెడ్డి, శెట్టి రమేష్, జూపల్లి రవికుమార్, మోహన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, యజ్ఞేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఎన్టీఆర్ కళాశాలలో జాతీయ సదస్సు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రబంధ వాజ్మ యం సాహిత్యం శీలనముఅనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నేటి కాలంలో కవులు అంతరించి పోతున్నారని, ఇలాంటి తరుణంలో కళాశాలలో ప్రబంధ వాజ్మయం పేరుతో సెమినార్ నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఈ ప్రబంధ వాజ్మయం హాస్యం, చతురత, వర్ణన, శృంగారం, కథ అనే అంశాల ఆధారంగా ఆనాటి జీవన స్థితిగతులను, ఆర్థిక, సామాజిక పరిస్థితులను వివరిస్తుందన్నారు. ఈ సందర్భంగా సెమినార్ సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీయూ ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీయూ కంట్రోలర్ రాజ్‌కుమార్, లక్ష్మీనరసింహరావు, కేశర్దన్ తదితరులు పాల్గొన్నారు.
22న జిల్లా సదస్సు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మే 20న నిర్వహించే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 22న జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి తెలిపారు. గురువారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు వెంకటేశ్‌గౌడ్, వేణుగోపాల్, అనురాధ, పద్మ, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

బావాజీ ఆలయ హుండీ ఆదాయం రూ.20 లక్షలు

బావాజీ ఆలయ హుండీ ఆదాయం రూ.20 లక్షలు