డెడ్‌ స్టోరేజీ | - | Sakshi
Sakshi News home page

డెడ్‌ స్టోరేజీ

Apr 18 2025 1:02 AM | Updated on Apr 18 2025 1:02 AM

డెడ్‌

డెడ్‌ స్టోరేజీ

మే నెలాఖరుకు ఎడారిలా.. జూరాల

అడుగంటిపోయిన జూరాల జలాశయం

గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దదిక్కుగా అయిన జూరాల జలాశయం గతంలో ఎన్నడూ లేనంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతోంది. వరుసగా రెండో ఏడాది కూడా జలాశయం అడుగంటిపోయింది. ఫలితంగా ఇప్పటికే సాగునీటి కష్టా లు తలెత్తగా.. రాబోయే రోజుల్లో తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురుకానున్నాయి. అధికారులు ఇప్పటికే జూరాల ఎడమ, కుడి ప్రధాన కాల్వల కింద రబీలో సాగుచేసిన ఆయకట్టుకు నీటి విడుదల పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం జూరాలలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు ఈ నెలాఖరు నాటికే సరిపోతాయని, మే, జూన్‌ నెలల్లో తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తవచ్చని రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నేపథ్యంలో రాబోయే రెండు నెలల్లో తాగునీటి గండాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నా య చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జిల్లాకు రూ.కోటి చొప్పున రూ.5 కోట్లను ఆయా కలెక్టర్లకు విడుదల చేశారు.

అధిక సాగు నేపథ్యంలో..

జూరాల కింద.. జూరాల జలాశయం కింద ఎడమ, కుడి ప్రధాన కాల్వలు ఉండగా.. దీని ద మొత్తం ఆయకట్టు 1.09 లక్షల ఎకరాలు. కాగా ప్రతి ఏడాది ఖరీఫ్‌లో ఎడమ ప్రధాన కాల్వ పరిధిలో వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో 72 వేల ఎకరాలు, కుడి ప్రధాన కాల్వ కింద జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో 37 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. ఈ ఏడాది జూరాలలో నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని ఆయా కాల్వల కింద కేవలం 35 వేల ఎకరాలకు వారబందీ విధానంలో ఏప్రిల్‌ 15 వరకు సాగునీటిని అందిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ, రైతులు అధికంగా సుమారు 50 వేల ఎకరాల్లో వరిపంట సాగుచేయడంతో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి.

ఏడాది అందుబాటులో నీటినిల్వ

2016 3.696 టీఎంసీలు

2017 4.829 టీఎంసీలు

2018 4.747 టీఎంసీలు

2019 2.689టీఎంసీలు

2020 7.627 టీఎంసీలు

2021 6.477 టీఎంసీలు

2022 7.836 టీఎంసీలు

2023 4.038 టీఎంసీలు

2024 4.004 టీఎంసీలు

2025 2.953 టీఎంసీలు

(ఏప్రిల్‌17)

మే నెలాఖరు నాటికే..

ఇదిలా ఉండగా ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్‌, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగరకర్నూల్‌ జిల్లాలు తాగునీటి అవసరాల కోసం జూరాల జలాశయం మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇందుకోసం ప్రస్తుతం రోజుకు 0.1 టీఎంసీల నీటిని వదులుతున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన జలాశయంలో ఉన్న 0.208 టీఎంసీల నీరు మే నెలాఖరు నాటికే సరిపోతాయని అధికారులు అంచనా వేశారు.

అడుగంటిన జలాశయం..

ఆందోళనలో రైతన్నలు

ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 2.871 టీఎంసీలు మాత్రమే

తాగునీటి కోసం ప్రతి రోజు

0.1 టీఎంసీలు వినియోగం

ఇప్పటికే ఆయకట్టు పరిధిలోని

పంటలకు సాగునీటి నిలిపివేత

రాబోయే రోజుల్లో మరింత గడ్డు

పరిస్థితులు

డెడ్‌ స్టోరేజీ1
1/1

డెడ్‌ స్టోరేజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement