
ఘనంగా బీరప్ప బండారు ఉత్సవం
మక్తల్: కుర్వ కులస్తుల ఆరాధ్యదైవమైన బీరప్ప దేవర ఉత్సవాలు మండలంలోని కర్ని గ్రామంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం గ్రామంలోని అడవి బీరప్పస్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్‌ట్ర, హైదరాబాద్, తదిర ప్రాంతాల నుంచి దాదాపు 15వేల మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం బీరప్ప దేవుడికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించారు. బీరప్పను ఇంటి దేవుడిగా కొలిచే వారు కుటుంబ సమేతంగా బండారు మహోత్సవంలో పాల్గొనగా బంధువులు పసుపు (బండారు)ను చల్లి ఆశీర్వదించారు. బండారు మహోత్సవంతో ఆలయ ప్రాంగణమంతా పసుపు మయంగా మారింది. నాలుగు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు పెళ్లీడుకు వచ్చిన పిల్లలకు పట్టం కట్టడం, రెండో రోజు బీరప్పస్వామి బండారు (పసుపు) చల్లడం, మూడోరోజు తమ మొక్కుల మేరకు గొర్రెలు, మేకలు బలి ఇవ్వడం, నాల్గో రోజు ఎల్లమ్మ బండారు నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి తదితరులు హాజరై బీరప్పకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుర్వ కులస్తులపై బండారు చల్లి ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండయ్య, అధికార ప్రతినిది శంకరోళ్ళ రవికుమార్, దేవరి మల్లప్ప, గణేష్‌కుమార్, కోళ్ళ వెంకటేస్, నారాయణరెడ్డి, నర్సింహగౌడ్, గాసం చిన్న రంగప్ప, వసంతగౌడ్ పాల్గొన్నారు.
వందలాదిగా తరలివచ్చిన భక్తులు
ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రత్యేక పూజలు

ఘనంగా బీరప్ప బండారు ఉత్సవం

ఘనంగా బీరప్ప బండారు ఉత్సవం