
ఉద్యోగ ఆధారిత కోర్సులు ప్రవేశ పెడతాం..
డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు.. ఆ వెంటనే ఉద్యోగాలు సాధించే దిశగా వివిధ కోర్సుల్లో అన్ని స్థాయిల్లో సిలబస్‌లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. కొత్త కోర్సుల వల్ల సులువుగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్‌టెక్, రీసెర్చి ఆప్టిట్యూట్, మెషిన్ టూల్స్, వంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. సాధారణ తరగతులతో పాటు వీటిని బోధిస్తారు. అవకాశం ఉన్న కోర్సుల్లో మార్కులు నేరుగా విద్యార్థి మెమోలో ముద్రిస్తాం. అవకాశం లేని వాటికి నేరుగా సర్టిఫికెట్లు అందజేస్తాం.
– జీఎన్.శ్రీనివాస్, వైస్ చాన్స్‌లర్, పీయూ
ఉన్నత విద్యా మండలి సూచనలతో..
ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. చదువులు పూర్తయిన వెంటనే సాంకేతిక విద్యనభ్యసించిన వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం, ఉన్నత విద్యా మండలి సూచనలతో సిలబస్‌లో 25 శాతం మార్పులకు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తాం.
– రమేష్ బాబు, రిజిస్ట్రార్, పీయూ
●

ఉద్యోగ ఆధారిత కోర్సులు ప్రవేశ పెడతాం..