
అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి
ఖాజీపూర్‌లో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయగా.. మంత్రి రైతుల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. ఈక్రమంలో గ్రామానికి చెందిన బంటు చంద్రమ్మ.. తన తల్లి సాయమ్మ పేరు మీద ఉన్న 3 ఎకరాల భూమిని నా పేరుకు మార్చాలని సమస్యను మంత్రికి వివరించింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేయాలని అక్కడే ఉన్న అధికారులకు మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు భూ భారతి ఓ మైలురాయిలా ఉండిపోవాలన్నారు. నా పేరు మీద తప్పుడు రికార్డులున్నా కూడా ఉపేక్షించకుండా పార్టీలకతీతంగా భూ సమస్యలను పరిష్కరించాలని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు.