
వైభవంగాబండారోత్సవం
మక్తల్: కుర్వ కులస్తుల ఆరాధ్యదైవమైన బీరప్ప, ఎల్లమ్మ ఉత్సవాలు మండలంలోని కర్ని గ్రామంలో బుధవారం వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని అమ్మవారి ఆలయం వద్ద బండారోత్సవం నిర్వహించారు. బీరప్పను ఇంటి దేవుడిగా కొలిచే వారు కుటుంబ సమేతంగా బండారు మహోత్సవంలో పాల్గొనగా బంధువులు పసుపు (బండారు)ను చల్లి ఆశీర్వదించారు. బండారు మహోత్సవంతో ఆలయ ప్రాంగణమంతా పసుపు మయంగా మారింది. నాయకులు జుబేర్‌పాష, రాజుల ఆశిరెడ్డి, నారాయణరెడ్డి, గాసం చిన్న రంగప్ప, వసంతగౌడ్, కృష్ణయ్యగౌడ్ తదితరులు హాజరై కుర్వ కులస్తులపై బండారు చల్లి ఆశీర్వదించారు.