ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఇక ఆన్‌లైన్‌లో.. | - | Sakshi
Sakshi News home page

ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఇక ఆన్‌లైన్‌లో..

Apr 18 2025 11:51 PM | Updated on Apr 18 2025 11:51 PM

ప్రోగ

ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఇక ఆన్‌లైన్‌లో..

నారాయణపేట రూరల్‌: విద్యా సంవత్సరంలో చివరిగా నిర్వహించే ఎస్‌ఏ 2 పరీక్షలు పూర్తి కావడంతో ఉపాధ్యాయులు సమాధాన పత్రాల మూల్యాంకనంలో బిజీగా గడుపుతున్నారు. ఈనెల 23తో విద్యా సంవత్సరం పూర్తి అవుతున్న నేపథ్యంలో పిల్లల ప్రగతిని తెలిపే ప్రోగ్రెస్‌ రిపోర్టులను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో మాదిరి కాకుండా పాత విధానానికి స్వస్తి పలికి ఈసారి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ప్రగతి పత్రాలను అందజేస్తున్నారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది జరిగిన నాలుగు ఫార్మేటివ్‌ అసెస్మెంట్‌ పరీక్షలతో పాటు సమ్మేటివ్‌ అసెస్మెంట్‌ 1 పరీక్షకు సంబంధించిన మార్పులను ఆన్‌లైన్‌ లో అప్‌లోడ్‌ చేశారు. ఇక ఎస్‌ఏ 2 పరీక్ష ఫలితాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచేందుకు సన్నద్ధమవుతున్నారు. కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులే స్వయంగా ఆన్‌లైన్‌లో మార్కులు పొందుపరుస్తుండగా, ఈ సదుపాయం లేని స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు చేతిరాతతో రాసి కాంప్లెక్స్‌ సముదాయంలోని సిఆర్‌పీల ద్వారా మార్పులను వెబ్‌సైట్లో పొందుపరుస్తున్నారు. ఇక ఎస్‌ఏ 2 పరీక్షలకు సంబంధించి సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి ఈనెల 20 లోగా మార్కులను అప్‌లోడ్‌ చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 21న ఆన్‌లైన్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకొని మరోసారి క్రాస్‌ చెక్‌ చేసుకోవాలని సూచించింది. అన్ని సిద్ధం చేసుకుని ఈ నెల 23న తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి వారి సమక్షంలోనే ఆన్‌లైన్‌లో ప్రోగ్రెస్‌ కార్డులను విద్యార్థులకు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

ముగిసిన ఎస్‌ఏ 2 పరీక్షలు

ఈ నెల 23న ఆఖరి పనిదినం

సమాధాన పత్రాల మూల్యాంకనంలో టీచర్లు బిజీబిజీ

ప్రతి విద్యార్థికి అందిస్తాం..

ప్రభుత్వ పాఠశాలలో చ దివే ఒకటి నుంచి 9వ త రగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా ప్రోగ్రెస్‌ రిపో ర్టులను అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. ఇప్పటికే పాఠశాలలో నిర్వహించిన అన్ని రకాల పరీక్షల మార్కులను సంబంధిత హెచ్‌ఎంలు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. సోమవారంలోగా క్రాస్‌ చెక్‌ చేసుకుని ఈ నెల 23 చివరి పని దినం పిల్లల తల్లిదండ్రులకు అందించాలని టీచర్లకు ఆదేశాలు ఇచ్చాం. – గోవిందరాజు, డీఈఓ

ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఇక ఆన్‌లైన్‌లో.. 1
1/2

ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఇక ఆన్‌లైన్‌లో..

ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఇక ఆన్‌లైన్‌లో.. 2
2/2

ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఇక ఆన్‌లైన్‌లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement