
లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
నారాయణపేట: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవలు ఎంతో అభినందనీయమని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి, ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం బాలాజీ గోల్డ్–సిల్వర్ ప్రయివేట్ లిమిటెడ్, కార్పొరెట్ సోషల్ రెస్పాన్సిబులిటి, లయన్‌న్స్ లైఫ్ చారిట్రబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ మాజీగవర్నర్ సరిత హరినారాయణ్ బట్టడ్ నేతృత్వంలో పట్టణంలోని ఎర్రగుట్ట వద్దనున్న కస్తూర్భాగాంధీ పాఠశాల విద్యార్థినులకు రూ.5లక్షల విలువ గల బెంకర్ బెడ్స్‌ను అందజేశారు. ఈకార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అనంతరం పట్టణంలోని మహంకాళి వీధిలో గల హరినారాయణ బట్టడ్ నివాసంలో రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లయన్‌న్స్ క్లబ్ సభ్యులు సేవా దృక్పథంతో ఏర్పాటు చేసే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేజీబీవీ విద్యార్థినులకు బంకర్ బెడ్స్ ఇచ్చిన క్లబ్ సభ్యులను కలెక్టర్ అభినందించారు. రూ.7.50లక్షల అధునాతన అంబులెన్స్ వాహనాన్ని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, ఎస్పీ యోగేష్ గౌతమ్ ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, కుంభం శివకుమార్ రెడ్డి, బాలాజీ గోల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ బబితా సాకేత్‌బట్టడ్, సురేష్ జగ్ననానీ, ఎంవి చారి రమేష్ చంద్రబాబు, శక్తి పీఠం వ్యవస్థపకుడు డాక్టర్ శాంతానంద్‌స్వామి పాల్గొన్నారు.