
91మంది చిన్నారులకు తులాభారం
నారాయణపేట రూరల్: మండలంలోని జాజాపూర్ గ్రామంలో శనివారం ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జట్టి హనుమాన్ 36వ జాతర ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం, వెండి ఆభరణాలతో అలంకరణ, హారతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, 91మంది చిన్నారులకు తులాభారం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. ఏఎస్‌ఐ బాలరాజ్ ఆద్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
నారాయణపేట: జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ మహేష్‌గౌడ్ శనివారం తెలిపారు. ఇటీవల ఈదురు గాలులు వీస్తుడండంతో స్థానిక సివిల్ బహర్‌పేట్, ధన్ గడ్డ, పరుమళాపురం, యాద్గిర్ రోడ్డు శాంతినగర్ ప్రాంతంలో విద్యుత్ తీగల కింద ఉన్న చెట్టు కొమ్మలతో ప్రమాదం పొంచి ఉందని, ఈక్రమంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి కొమ్మలను తొలగించనున్నామని తెలిపారు. పట్టణ ప్రజలు సహకరించాలని ఏఈ కోరారు.
యూనిఫాంలు
సిద్ధం చేయాలి
మరికల్: పాఠశాలాలు పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు సంబందించిన యూనిఫాంలను సిద్ధం చేయాలని సీఈఓ రాజేంద్రకుమార్ మహిళా సమాఖ్య సభ్యులకు సూచించారు. శనివారం విద్యార్థుల కొలతలు చేసిన కటింగ్ చేసిన దుస్తులను మహిళా సమాఖ్య వారికి అందజేశారు. వీటిని జూన్ 2 నాటికి పాఠశాలలకు అప్పగించాలని తెలిపారు. ఆలస్యం చేయకుండా త్వరగా యూనిపామ్‌లను సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మనోరంజిని, యాదయ్యశేట్టి, చెన్నప్ప, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
పీయూలో
ప్రాంగణ ఎంపికలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లోని సెమినార్ హాల్‌లో శనివారం ఎంఎస్‌ఎన్ లేబరేటరీ నిర్వాహకులు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. కాగా క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ పోస్టుల కోసం యూజీ, పీజీ రసాయన శాస్త్రం విద్యార్థులు 60 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డా.ఎస్‌ఎన్ అర్జున్‌కుమార్ మాట్లాడుతూ మొదటి దశలో రాత పరీక్ష ఉంటుందన్నారు. ఇందులో అర్హత సాధించిన ఉద్యోగార్థ్లుకు తర్వాత ముఖాముఖి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. త్వరలోనే తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.మధుసూదన్‌రెడ్డి, హెచ్‌ఆర్ సుబ్బారావుతో పాటు క్యూసీ మేనేజర్లు పాల్గొన్నారు.