
పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి
మక్తల్: రిజర్వాయర్లకు సంబందించి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మక్తల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. గతంలో కాల్వల పనులు, గెట్ల పనులు పెండింగ్‌లో ఉన్న వాటిని గుర్తించి వెంటనే పూర్తి చేయాలని అన్నారు. గెట్ల నుంచి నీరు వృథాగా పోతుందని, కాల్వలు అసంపూర్తి దశలో ఉన్నాయని అన్నారు. మరమ్మతు పనులు వేగవంతం చేయాలని, సాగునీటి విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని అన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, అధికారులు దగ్గరుండా పనులు పూర్తి చేయించాలని అన్నారు. రైతులు పంటల సాగు విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.