
ఉత్సాహంగా జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని స్థానిక మినీ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. 60 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్ పోటీలు బాలుర, బాలికల విభాగంలో విడివిడిగా అండర్ –8,10,12,14,16, అండర్–20లలో నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారికి మెడల్స్ అందజేశారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి స్పోర్ట్స్ స్కూల్, ఆర్మీ స్కూల్‌లలో ప్రవేశానికి ఈ మెడల్స్ ఎంతో ఉపయోగపడతాయని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. కార్యక్రమంలో ఖేలో ఇండియా అథ్లెటిక్ కోచ్ హారిక దేవి, పీఈటీ అక్తర్ ఫాషా, ఆంజనేయులు, భాను ప్రకాష్, పాల్గొన్నారు.