
చలో వరంగల్..
విశేష స్పందన
ఆర్టీసీ లాజిస్టిక్ (కార్గో) చేపట్టిన రాములోరి తలంబ్రాలకు విశేష స్పందన లభించింది.
వాతావరణం
ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. వేడిగాలులు వీస్తాయి.
వివరాలు IIలో u
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘గులాబీ’ శ్రేణుల్లో రజతోత్సవ సందడి నెలకొంది. బీఆర్‌ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో ఆదివారం నిర్వహిస్తున్న రజతోత్సవ సభను ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు భారీ జనసమీకరణకు ఇదివరకే సన్నాహాలు మొదలుపెట్టిన నేతలు.. తాము రూపొందించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ముందుకుసాగుతున్నారు. నేడు ఊరూరా పార్టీ జెండావిష్కరణలను పండుగ వాతావారణంలో నిర్వహించి.. అనంతరం వాహనాల్లో సభకు తరలేలా తగిన ఏర్పాట్లు చేశారు. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం సైతం పార్టీ జెండాలు ఆవిష్కరించారు. అదేవిధంగా ఫ్లెక్సీలు, పార్టీ బ్యానర్లతో మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాకేంద్రాల్లో పలు కూడళ్లు గులాబీమయంగా మారాయి.
పర్యవేక్షణకు ఇన్‌చార్జీల నియామకం..
వరంగల్‌కు సుదూర ప్రయాణం చేయాల్సి ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం పార్టీ నేతలకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రతి వాహనానికి ఓ ఇన్‌చార్జితో పాటు భోజనం, తాగునీటి వసతుల పర్యవేక్షణకు విడివిడిగా ఇన్‌చార్జీలను నియమించారు. అదేవిధంగా సభకు వెళ్లే ప్రతి వాహనానికి సంఖ్య, ఇన్‌చార్జి పేరు, సెల్ నంబర్‌తో స్టిక్కర్ ఏర్పాటు చేయనున్నారు. ఆయా ఇన్‌చార్జీలు నియోజకవర్గ ఇన్‌చార్జితో సమన్వయం చేసుకోనున్నారు. వాహనాలు ఎక్కడి నుంచి బయలు దేరాయి.. ఎక్కడ భోజనాలు చేశారు.. ఎప్పుడు సభకు వచ్చారు.. ఎప్పుడు వెళ్లారు.. ఇలా సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జీలు పర్యవేక్షించేలా పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది.
‘పాలమూరు’ ప్రధానాస్త్రంగా..
వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలంలో నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభ తర్వాత కేసీఆర్ పాలమూరులో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అస్త్రంగా ఆయన పోరు బాటకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఈ పథకానికి సంబంధించి చివరి దశలో ఉన్న పనులను పూర్తి చేయకపోవడం.. వెసులుబాటు ఉన్నా, నీటిని ఎత్తిపోయకుండా కాంగ్రెస్ ప్రభుత్వ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని బీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్య నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ఏం ప్రకటన చేస్తారనే దానిపై ఉమ్మడి జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.
బీఆర్‌ఎస్ శ్రేణుల్లో రజతోత్సవ సందడి
వరంగల్ సభకు భారీగా తరలుతున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు
ఉమ్మడి పాలమూరు నుంచి సుమారు 50 వేల మంది తరలింపు
బస్సులు, కార్లు ఇతర ప్రైవేట్‌వాహనాలను సమకూర్చిన నేతలు
పట్టణాలతో పాటు ఊరూరా పండుగలా పార్టీ జెండావిష్కరణలు
ఫ్లెక్సీలు, బ్యానర్లతో గులాబీమయమైన పలు కూడళ్లు