
ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి..
రోడ్లపై విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది వీలైనంత ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ కలిపిన నీటిని సైతం తీసుకోవాలి. ఎండలోనే ఎక్కువ సమయం నిలబడి ఉండే వారు నిమ్మరసం, కొబ్బరి నీళ్లు సైతం మేలు చేస్తాయి. చెమటలో నీటితో పాటు లవణాలు ఉంటాయి. వీటిలో సోడియం, క్లోరైడ్ ముఖ్యమైనవి. రోజుకు ఐదు లీటర్ల నీటిని తీసుకోవడంతో పాటు పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు తీసుకుంటే మంచిది.
– డాక్టర్ ఏజీ శంకర్, జనరల్ మెడిసిన్, మహబూబ్‌నగర్
జాగ్రత్తలు పాటిస్తున్నాం
జిల్లా ఎస్పీ సూచన మేరకు ఆరోగ్య జాగ్రత్తలు పాటించడంతో పాటు ఇటీవల ఎస్పీ ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ వాటర్ బాటిల్స్, క్యాప్‌లు, కూలింగ్ గ్లాస్‌లు అందజేశాం. అలాగే ఆరోగ్య పరీక్షలు సైతం చేయించారు. నిత్యం సిబ్బందికి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇస్తున్నాం.
– భగవంతురెడ్డి, ట్రాఫిక్ సీఐ, మహబూబ్‌నగర్
ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి..
పట్టణంలో ఉన్న ట్రాఫిక్ పాయింట్లు మొత్తం తిరుగుతూ తనిఖీలు చేస్తుంటాను. ధర్నాలు, ర్యాలీలు, ఇతర ట్రాఫిక్ సమస్యలు వస్తే ఘటన స్థలానికి వెళ్తుంటాను. ఇటీవల ఉన్నతాధికారులు అద్దాలు, టోపీలు, వాటర్‌బాటిల్స్ ఇవ్వడం వల్ల సిబ్బందికి ఉపయోగకరంగా మారాయి. మా వ్యక్తిగతంగా కూడా ఆరోగ్యపరంగా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం.
– లక్ష్మయ్య, ఏఎస్‌ఐ, మహబూబ్‌నగర్
జాగ్రత్తలు తీసుకుంటున్నాం..
దాదాపు ఆరు గంటల పాటు రోడ్లపై విధులు నిర్వహించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రధానంగా నీరు అధికంగా తాగుతున్నాం. ఉన్నతాధికారులు ఇచ్చిన టోపీలు, అద్దాలు ఉపయోగపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో తలనొప్పి వంటి సమస్య వస్తే మజ్జిగ, ఇతర ద్రవ పదార్థాలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల నుంచి కావాల్సిన సహాయం అందుతుంది.
– రాఘవేందర్, ట్రాఫిక్ కానిస్టేబుల్, మహబూబ్‌నగర్
ఎండతో ఇబ్బందికరం..
ట్రాఫిక్ నియత్రించేందుకు ఎండలో నిలబడటం వల్ల ఎండవేడిమితో ఇబ్బందికరంగా ఉంది. షిఫ్ట్‌ల వారీగా విధులు ఉండటంతో కొంత ఉపశమనంగా ఉంది. ఎండవేడిమి నుంచి రక్షణ పొందేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కూలింగ్ గ్లాసెస్‌తో పాటు టోపీలను అందజేశారు. ఎండలో ట్రాఫిక్ డ్యూటీలో ఉండే సిబ్బంది వడదెబ్బకు గురికాకుండా ఉండటంకోసం ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేస్తున్నారు.
– శ్రీనివాస్, ట్రాఫిక్ కానిస్టేబుల్, నాగర్‌కర్నూల్
●

ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి..

ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి..

ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి..

ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి..