
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
మరికల్: యాసంగిలో సాగు చేసిన వరిధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఎవరూ ఆధైరపడొద్దని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. మండలంలోని లాల్‌కోట చౌరస్తాలోని తీలేర్ సింగిల్‌విండో సొసైటీ వద్ద బుధవారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు ఎవరు కూడా దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యం అమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్‌తో క్వింటాల్‌కు రూ. 2,820 చెల్లిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, విండో అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్, సూర్యమోహన్‌రెడ్డి, జయసింహరెడ్డి, కృష్ణయ్య, తిమ్మరెడ్డి, హరీష్, రామకృష్ణారెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.