ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించొద్దు | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించొద్దు

Apr 5 2025 12:27 AM | Updated on Apr 5 2025 12:27 AM

ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించొద్దు

ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించొద్దు

నారాయణపేట రూరల్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించవద్దని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. నారాయణపేట, ధన్వాడ మండలాల్లో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. అప్పక్‌పల్లిలో గత ఫిబ్రవరిలో సీఎం రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేసిన దేవమ్మ ఇంటి నిర్మాణ పను ల పురోగతిని తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించా రు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అదే గ్రామానికి చెంది న షమీ బేగం, ఆశాబేగం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి.. లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ధన్వాడలో రూఫ్‌ లెవెల్‌ వరకు నిర్మా ణం పూర్తయిన ఇందిరమ్మ మోడల్‌ హౌస్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. నెలరోజుల్లో నిర్మాణం పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అదే విధంగా రాజీవ్‌ యువ వికాసం పథకం దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు.

వంద రోజులపాటు ‘ఉపాధి’ కల్పించాలి..

ఉపాధి హామీ పథకంలో కూలీలకు వంద రోజులపాటు పనులు కల్పించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. నారాయణపేట మండలం అప్పక్‌పల్లిలో ఉపాధి హామీ పనులను కలెక్టర్‌ పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారని.. రోజుకు ఎంత కూలి పడుతుందని ఆరా తీశారు. వచ్చిన డబ్బు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందా? లేక బీపీఎం బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌ వద్ద తీసుకుంటున్నారా అని కూలీలను అడిగి తెలుసుకున్నారు. కొందరు కూలీలు తమకు ఇంతవరకు కూలి డబ్బులు రాలేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా.. డబ్బులు కూలీల ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని ఏపీఓను ఆదేశించారు. పని ప్రదేశంలో కూలీలకు ఏర్పాటుచేసిన టెంట్‌, నీటి వసతిని చూశారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీఓ సుదర్శన్‌, సాయి ప్రకాశ్‌ తదితరులు ఉన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి

నారాయణపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస వసతులు కల్పించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సివిల్‌ సప్లై శాఖ ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా సన్నాలకు రూ. 500 బోనస్‌ ఇస్తోందన్నారు. కేంద్రాల్లో దొడ్డు రకం, సన్నరకం వడ్లను కొనేందుకు వేర్వేరుగా కౌంటర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు. కొనుగోలు కేంద్రంలో తేమ శాతాన్ని కొలిచే యంత్రాలు, అవసరమైనన్ని గన్ని బస్తాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ట్యాబ్‌, రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, సివిల్‌ సప్లై డీఎం సైదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement