
రజతోత్సవ సభకు తరలిరావాలి
నారాయణపేట: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ఈ నెల 27న నిర్వహించే పార్టీ అవిర్భావ రజోత్సవ సభకు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున కదలిరావాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డి పిలునిచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం (ఏప్రిల్ 27) పురస్కరించుకొని వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు గడప,గడప నుంచి భారీ ఎత్తున గులాబీ దళాన్ని తరలించాలని, రజోత్సవ వేడుకలతో బీఆర్‌ఎస్‌కు మళ్లీ పూర్వ వైభవం రానుందన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నరన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు విజయ్‌సాగర్, వేపూరిరాములు,భగవంతు, చెన్నారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
నేడు బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం
జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం గేట్ వద్దనున్న బీఆర్‌ఎస్ కార్యాలయంలో గురువారం ఉదయం 10గంటలకు కార్యకర్తల సమావేశం నిర్వ హించనున్నట్లు ఆ పార్టీ పట్టణ, మండల అధ్యక్షుడు విజయ్‌సాగర్, వేపూరి రాములు పేర్కొన్నారు.