
సత్యసాయి సేవలు చిరస్మరణీయం
నారాయణపేట రూరల్: భగవాన్ శ్రీసత్యసాయి సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల సౌకర్యార్థం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాగునీటి సమస్యను గుర్తించి నాడు ఈ ప్రాంతానికి నీరు అందించిన భగవంతుడు సాయి అన్నారు. ఆయన సేవలను మరితం విసృతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరు సామాజిక సేవా దృక్పథంతో ముందుకు సాగాలని, ఎండాకాలంలో దాహం తీర్చడం ఎంతో గొప్ప కార్యమని అన్నారు. నీటి వనరులను కాపాడుకోవాలని, ప్రతి ఒక్కరు నీటిని వృధా చేయరాదని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం లావణ్య, సేవా సమితి సభ్యులు చిట్టెం మాధవరెడ్డి, మల్లికార్జున్, గోపీనాథ్‌రావు, శివరాజు, ఆనంద్, బీవీఎన్ రెడ్డి పాల్గొన్నారు.