
ఇబ్బందులు పడుతున్నాం..
ప్రభుత్వం సన్న, చిన్నకారు రైతులకు సబ్సిడీ పై అందించే టార్పాలిన్ల పంపిణీ నిలిచిపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్నాం. మాములు సంచులతో తయారు చేసిన పట్టాలను వినియోగించుకుంటున్నాం. వీటిని రోజుకు రూ. 30 చొప్పున అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. టార్పాలిన్ల పంపిణీ పథకాన్ని పునరుద్ధరించాలి.
– మగ్ధుంఅలీ రైతు, కల్వాల్
పథకం నిలిచిపోయింది..
రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు సబ్సిడీపై ఇచ్చే టార్పాలిన్ల పథకం కొన్నేళ్ల క్రితం నిలిచిపోయింది. రైతులు తమ పొలాల్లో కల్లాలు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఈ మేరకు ఉపాధి హామీ పథకం ద్వారా కల్లాల నిర్మాణాలు చేపట్టారు. రైతులు రహదారులపై పంట నూర్పిళ్లు చేయకుండా కల్లాలను ఏర్పాటు చేసుకోవాలి.
– జాన్ సుధాకర్, డీఏఓ
●

ఇబ్బందులు పడుతున్నాం..