
మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధి ప్రణాళికలు
మద్దూరు: నూతనంగా ఏర్పడిన మద్దూరు మున్సిపాలిటీ సమగ్రాభిద్ధికి ప్రణాళికలు సిద్దం చేస్తామని ఎన్‌సీపీఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు ఇంజినీర్ మహ్మమద్ సిద్దికి తెలియజేశారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో మున్సిపల్ కమిషన్ శ్రీకాంత్, మద్దూరు, రెనివట్ల గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ మున్సిపాలిటీ మరో 30 ఏళ్ల వరకు సరిపడా ప్రణాళికలు రుపొందించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. మీమీ గ్రామాల్లో అత్యంత ప్రాధాన్యత అంశాలను మాకు తెలియజేయాలని కోరారు. దీంతో వారు పలు సూచనలు చేశారు. రెండు నెలల పాటు మున్సిపాలిటీలో తిరిగి సమగ్ర ప్రణాళికలు సిద్దం చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ మహేష్, మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్, మల్లీకార్జున్, బాబుస్వామి, చంద్రమోహన్, శ్రీనావాస్‌రెడ్డి, ఆశోక్, య సిన్, చందు, రామక్రిష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.