20 నుంచి ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

20 నుంచి ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

Apr 10 2025 12:45 AM | Updated on Apr 10 2025 12:45 AM

20 ను

20 నుంచి ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

దామరగిద్ద: 2024–25 విద్యాసంవత్సరం ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ వార్షిక పరీక్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయని జెడ్పీ ఉన్నత పాఠశాల జీఎచ్‌ఎం అశోక్‌కుమార్‌, అసిస్టెంట్‌ కోఆర్డినేటర్‌ శంభులింగం తెలిపారు. విద్యార్థులు స్థానిక అధ్యయన కేంద్రం (జెడ్పీఉన్నత పాఠశాల)లో సంప్రదించి హాల్‌టికెట్లు పొందాలని, పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకుకొనసాగుతాయన్నారు.

గ్రామీణ ప్రాంతాల

అభివృద్ధే లక్ష్యం

కోస్గి రూరల్‌: నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వార్లవిజయ్‌కుమార్‌, మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చెన్నారంలో పలు గ్రామాల బీటీ రోడ్లకు భూమి పూజ చేపట్టారు. రూ 9.14 కోట్ల నిధులతో చెన్నారం నుంచి కడంపల్లి, చెన్నారం నుంచి ముక్తిపహడ్‌ గ్రామల వరకు బీటీ రోడ్డు పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తామని, ఇప్పటికే రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. త్వరలో యువతకు సైతం సబ్సిడీపై రుణాలు అందజేయనున్నట్లు వివరించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చూస్తామని వారు అన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గిరిప్రసాద్‌రెడ్డి, బెజ్జురాములు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర బడ్జెట్‌లో క్రీడల

అభివృద్ధికి రూ.465 కోట్లు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 465 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ క్రీడల వ్యవహారాల సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని జితేందర్‌రెడ్డి నివాసంలో బుధవారం లాక్రోస్‌ క్రీడాకారులు, రాష్ట్ర సంఘం ప్రతినిధులు ఆయనను మర్వాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌లో క్రీడలకు కేటాయించిన నిధులతో రాష్ట్రంలో మరుగున పడిన క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామన్నారు. యువత మాదక ద్రవ్యాల వైపు మరలకుండా ఏదో ఓ క్రీడలో పాలుపంచుకోవాలని సూచించారు. లాక్రోస్‌ క్రీడను రాష్ట్రంలో అభివృద్ధి పరిచి గుర్తింపు తీసుకొస్తామని తెలిపారు. లాక్రోస్‌ క్రీడ అభివృద్ధి చెందిన అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ముఖ్య క్రీడగా ఉందని, ఇండియాలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుందని లాక్రోస్‌ ఇండియా టీమ్‌ కెప్టెన్‌ అనుదీప్‌రెడ్డి తెలిపారు. త్వరలో ఆగ్రాలో లా క్రోస్‌ క్రీడ నేషనల్స్‌ నిర్వహిస్తున్నారని చెప్పా రు. కార్యక్రమంలో తెలంగాణ లాక్రోస్‌ అకాడమీ అధ్యక్షుడు భానుచందర్‌, ప్రధాన కార్యదర్శి శేఖర్‌, కోచ్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

విచారణ ప్రారంభం

నారాయణపేట: అడిషనల్‌ డీఆర్‌డీఓపై సెర్ఫ్‌ ఉద్యోగులు చేసిన ఫిర్యాదుతో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ విచారణ కమిటిని నియమించింది. బుధవారం ఆ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో సెర్ఫ్‌ ఉద్యోగులను విచారించారు. వారు తెలిపిన వివరాలను రికార్డు చేసుకున్నారు. అదే విధంగా అడిషనల్‌ డీఆర్‌డీఓతో సైతం స్టేట్‌మెంట్‌ను తీసుకున్నారు. ఈ నివేదికను రెండు రోజుల్లో కలెక్టర్‌కు నివేదిస్తున్నట్లు విచారణ కమిటీ చైర్మన్‌, ఇంచార్జీ డీడబ్ల్యూఓ జయ తెలిపారు.

20 నుంచి ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు 
1
1/1

20 నుంచి ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement