
అవగాహన కల్పించాలి
గిరివికాసం పథకం గురించి గిరిజనులకు పూర్తి వివరాలు తెలియ దు. అధికారులు ఎవరూ గిరిజనుల పల్లెల్లో అవగాహన కల్పించడం లేదు. దీంతో అర్హులైన వారు పథకానికి దూరమవుతున్నారు. గిరిజనశాఖ అధికారులైన అవగాహన కార్యక్రమాలు పెట్టి మా కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించాలి.
– రాజునాయక్,
బంజార సంఘం జిల్లా నాయకుడు
పథకం గురించి తెలియదు
మా భూముల్లో గవర్నమెంట్ బోర్లు వేయిస్తుందనే సంగతి మాకు తెలియదు. అధికారులు ఎవరూ వచ్చి చెప్పడం లేదు . ఏళ్లుగా సాగునీరు లేక మా భూములు పడావుగా ఉన్నాయి. ఈ పథకంతో సాగు చేసుకుందామనుకుంటే ఎట్లా దరఖాస్తు చేసుకోవాలో తెలియదు. సార్లు చెప్పితే దరఖాస్తు చేసుకుంటాం.
– ధరావత్ కల్యాణ్,
దేవునిగుట్ట తండా

అవగాహన కల్పించాలి