● ఎస్పీ మహేశ్ బి.గీతే ● తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): అధికారుల అప్రమత్తతతోనే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని ఎస్పీ మహేశ్ బి.గీతే అన్నారు. తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. సీజ్‌చేసిన వాహనాలు, స్టేషన్ రికార్డులు పరిశీలించి కేసులు త్వరగా దర్యాప్తు చేపట్టాలని సూచించారు. డయల్ 100, బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, ఎస్సై రామ్మోహన్ ఉన్నారు.
ఒకే దేశం..ఒకే ఎన్నిక అవసరం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
సిరిసిల్లటౌన్: పరిపాలన సామర్థ్యం పెంచేందుకు ఒకే దేశం.. ఒకే ఎన్నిక అవసరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. సిరిసిల్ల మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడమే లక్ష్యమన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ కారెడ్ల మల్లారెడ్డి, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధిహామీ పనులు చేపట్టాలి
● డీఆర్‌డీవో పీడీ శేషాద్రి
చందుర్తి(వేములవాడ): ఉపాధిహామీ పనులు లక్ష్యం మేరకు పూర్తి చేయాలని డీఆర్డీవో శేషాద్రి కోరారు. మండలంలోని మర్రిగడ్డలో చేపట్టిన ఫీడర్‌చానల్, కోళ్ల ఫారం షెడ్ పనులను మంగళవారం పరిశీలించారు. కూలీల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో చేపడుతున్న ఉపాధిహామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. పనిచేసే చోట కూలీలకు వసతులు కల్పించాలని సూచించారు. ఉపాధిహామీ ఏపీవో రాజయ్య, మర్రిగడ్డ గ్రామ కార్యదర్శి కవిత ఉన్నారు.
ఓటరుగా నమోదు చేసుకోవాలి
● వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్
వేములవాడఅర్బన్: 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్ కోరారు. తహసీల్దార్ ఆఫీస్‌లో వివిధ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశమయ్యారు. కొత్త ఓటరు నమోదు కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. తహసీల్దార్ మహేశ్‌కుమార్, పార్టీల ప్రతినిధులు పొలాస నరేందర్, రాము, రామస్వామి తదితరులు ఉన్నారు.
ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతం చేయండి
కోనరావుపేట(వేములవాడ): వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని జిల్లా వైద్యాధికారి రజిత కోరారు. కోనరావుపేటలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని, ధర్మారంలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. మాతాశిశు, అసంక్రమిత వ్యాధుల కార్యక్రమాలపై సమీక్షించారు. మండల వైద్యాధికారి వేణుమాధవ్, ప్రోగ్రాం అధికారులు అనిత, సంపత్, రామకృష్ణ, సూపర్‌వైజర్లు రషీద్, సువర్ణ, మెర్సీ ఉన్నారు.
అప్రమత్తతతోనే అదుపులో శాంతిభద్రతలు
అప్రమత్తతతోనే అదుపులో శాంతిభద్రతలు
అప్రమత్తతతోనే అదుపులో శాంతిభద్రతలు
అప్రమత్తతతోనే అదుపులో శాంతిభద్రతలు