
సబ్బండ వర్గాలతో రజతోత్సవ సభ
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
సిరిసిల్లటౌన్: వరంగల్‌లో నిర్వహించే పార్టీ రజతోత్సవ సభకు సిరిసిల్ల నుంచి సబ్బండ వర్గాలు హాజరవుతారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 27న జరిగే పార్టీ రజతోత్సవ సభ పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జిందం కళ, నాయకులు ఆకునూరి శంకరయ్య, దార్నం లక్ష్మీనారాయణ, మ్యాన రవి, ఎండీ సత్తార్, బొల్లి రామ్మోహన్, మంచె శ్రీనివాస్ పాల్గొన్నారు.
సభకు తరలిరావాలి
గంభీరావుపేట(సిరిసిల్ల): వరంగల్ సభకు మండలం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కోరారు. గంభీరావుపేటలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ మండలాధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్, నాయకులు గంధ్యాడపు రాజు, కొమిరిశెట్టి లక్ష్మణ్, మోతె రాజిరెడ్డి, దయాకర్‌రావు, రత్నాకర్, రాజేందర్, సత్యం పాల్గొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రభుత్వ వైఫల్యాలు ప్రజ ల్లోకి తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కోరారు. ముస్తాబాద్‌లో మాట్లాడారు. రైతుభరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల జాడే లేదన్నారు. బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సురేందర్‌రావు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, పట్టణాధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు కొమ్ము బాలయ్య, మాజీ ఎంపీపీ శరత్‌రావు, ఆర్‌బీఎస్ మాజీ అధ్యక్షుడు గోపాల్‌రావు, నాయకులు విజయరామారావు, సర్వర్, మల్లేశ్, జానబాయి, సుమతి, నర్సయ్య, సంతోష్‌రావు, చెవుల మల్లేశ్ పాల్గొన్నారు.