● ముఖ్య అతిథులుగా కేటీఆర్, హరీశ్‌రావు
కరీంనగర్: తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సన్నహాక సమావేశం ఆదివారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వీ–కన్వెన్షన్‌లో జరగనుంది. ఉమ్మడి జిల్లాస్థాయి సమావేశాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు హాజరు కానున్నారు. శనివారం వీకన్వెన్షన్ ఫంక్షన్‌హాల్ వద్ద ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏర్పాట్లు పరిశీలించారు. సమావేశానికి పార్టీ మాజీ కార్పొరేటర్లు, మాజీ కో– ఆప్షన్ మెంబర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
నేడు బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం