● టీజీబీ రీజినల్ మేనేజర్ రాజనరేంద్ర
ముస్తాబాద్: తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆ బ్యాంక్ రీజినల్ మేనేజర్ రాజనరేంద్ర కోరారు. ముస్తాబాద్‌లో నూతన బ్రాంచ్‌ను గురువారం ప్రారంభించారు. రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ టీజీబీలో అన్ని రకాల బ్యాంక్ సేవలు అందిస్తామన్నారు. ఇంటి, బంగారంపై, దీర్ఘకాలిక రుణాలను అందిస్తామని తెలిపారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును అధికంగా చెల్లిస్తామన్నారు. ప్రభుత్వరంగ సేవలను కూడా అందించడం జరుగుతుందన్నారు. బ్రాంచ్ మేనేజర్ రవివర్మ, గూడెంశాఖ మేనేజర్ వేణు, ఫీల్డ్ ఆఫీసర్ అరవింద్, క్యాషియర్ పర్శరాములు ఉన్నారు.


