కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
తంగళ్లపల్లి/ఇల్లంతకుంట: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట దళారుల పాలవుతోందని తెలుపుతూ గురువారం ‘ధాన్యం దళారులపాలు’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమవగా పౌరసఫరాల శాఖ అధికారులు స్పందించారు. జిల్లాలో 238 ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటా యించామని, ఈనెల రెండోవారంలో ప్రారంభిస్తామని తెలిపారు. ధాన్యం ఆరబెట్టి తేమశాతం 17 అంతకంటే తక్కువగా ఉంటే కొనుగోళ్లు చేస్తామని తెలిపారు.
ట్రేడ్ లైసెన్సుల పేరుతో అక్రమ వసూళ్లు : కమిషనర్
సిరిసిల్లటౌన్: పురపాలక సంఘం ఉద్యోగుల పేరుతో కొందరు కమర్షియల్ షాపుల నిర్వాహకులకు ఫోన్‌కాల్స్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎవరూ కూడా అలాంటి ఫోన్‌కాల్స్‌కు స్పందించొద్దని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య కోరారు. 63043 26727, 70916 01526 నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నట్లు పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇలాంటి ఫోన్‌కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.


