విద్యార్థులపై దాడి అమానుషం
● హెచ్‌సీయూ భూముల విక్రయం విరమించుకోవాలి ● ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించిన విద్యార్థి సంఘాలు
ిసరిసిల్లటౌన్/ముస్తాబాద్/చందుర్తి(వేములవాడ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసుల దాష్టీకం సరికాదని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. హెచ్‌సీయూ భూముల విక్రయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేందుకు చేస్తున్న సర్కారు కుట్రను ప్రశ్నించిన విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. మట్టె శ్రీనివాస్, ముగ్దం అనీల్, వెంకటేష్, అడిచెర్ల సాయి, రాజు, మహేష్, నాగరాజు పాల్గొన్నారు.
ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి
ముస్తాబాద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేశ్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో కార్పొరేట్ కంపెనీల కోసం సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మడం సరికాదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు.
నిర్ణయం రద్దు చేసుకోవాలి
బీఆర్‌ఎస్‌వై వేములవాడ నియోజవర్గ అధ్యక్షుడు ఈర్లపల్లి రాజు చందుర్తిలో మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ భూముల వేలం నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం కుట్రతోనే పండుగ పూట విద్యార్థులపై పోలీసులతో దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


