
వాట్సాప్ పోస్టుతో బీఆర్‌ఎస్ నాయకుడిపై కేసు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా వాట్సాప్‌లో పోస్టు చేసిన బీఆర్‌ఎస్ నాయకుడిపై కేసు నమోదు చేసినట్లు తంగళ్లపల్లి ఎస్సై బి.రామ్మోహన్ ఆదివారం తెలిపారు. చిన్నలింగాపూర్ మాజీ ఎంపీటీసీ బైరినేని రామును కించపరిచేలా రామచంద్రాపూర్‌కు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు బొడ్డు శ్రీధర్ వాట్సాప్ గ్రూపులలో పోస్టు చేశారు. బైరినేని రాము ఫిర్యాదుతో శ్రీధర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా బీఆర్‌ఎస్ నాయకుడు శ్రీధర్‌ను జిల్లా నాయకుడు బొల్లి రామ్మోహన్, మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, నాయకులు పరామర్శించారు.