● ఎస్పీ మహేశ్ బీ గీతే
ఇల్లంతకుంట(మానకొండూర్): గంజాయి సేవించడం, అక్రమ రవాణా చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టి కట్టడి చేయాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఠాణాను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. పెట్రోలింగ్ సమయంలో అనుమానితులు కనిపిస్తే వెంటనే తనిఖీ చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌లలో నమోదవుతున్న కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఠాణాలోని గ్రౌండ్‌లో నాటిన పండ్లతోటకు బిందు సేద్యం ప్రారంభించారు. డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, రూరల్ సీఐ మొగిలి, ఇల్లంతకుంట ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ ఉన్నారు.
సీనియర్ సిటిజెన్ పోస్టర్ ఆవిష్కరణ
సిరిసిల్లకల్చరల్: వృద్ధుల సంరక్షణ చట్టంలోని కీలక సెక్షన్లతో కూడిన పోస్టర్‌ను ఎస్పీ మహేశ్ బీ గీతే బుధవారం ఆవిష్కరించారు. ఎస్పీ ఆఫీస్‌లో పోస్టర్ ఆవిష్కరణలో సీనియర్ సిటీజన్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చేపూరి బుచ్చయ్య, డాక్టర్ జనపాల శంకరయ్య, సంఘం బాధ్యులు శ్రీగాద మైసయ్య, దొంత దేవదాస్, అంకారపు జ్ఞానోభ, శ్రీకాంత్ పాల్గొన్నారు.


