
కొదురుపాకలో దొంగతనం
● ఐదు తులాల బంగారం.. 24 తులాల వెండి చోరీ
బోయినపల్లి(చొప్పదండి): అంగన్‌వాడీ కేంద్రంలో కోడిగుడ్లు తెచ్చుకోవడానికి ఇంటికి గడియపెట్టి వెళ్తే తిరిగి వచ్చే సరికి దొంగతనం జరిగింది. ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ తెలిపిన వివరాలు. కొదురుపాకకు చెందిన సట్ట జలజ కోడిగుడ్ల కోసం ఇంటికి గడియపెట్టి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లోని రెండు బీరువాల తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువా వద్దకు వెళ్లి చూడగా అందులో ఉన్న తన అత్తమ్మ బంగారం కనిపించలేదు. గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 5 తులాల 9 గ్రాముల బంగారు నగలు, 24 తులాల వెండి ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ పరిశీలించారు. ఫింగర్‌ప్రింట్, డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేపట్టారు.