
రూ.10వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం
సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రూ.10వేల కోట్లతో రాజీవ్ యువవికాసం పథకానికి రూపకల్పన చేసిందని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్‌లకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చిన శిక్షణలో మాట్లాడారు. జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్క యువకుడికి అవకాశం కల్పించాలన్నారు. మండలాల్లోని తహసీల్దార్లు కులం, ఆదాయం సర్టిఫికెట్ల జారీపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎంపీడీవో, మున్సిపల్ ఆఫీస్‌ల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. గడువులోగా వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి మండల్ లెవెల్ కమిటీకి పంపిస్తారని వివరించారు. ఆ కమిటీ పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత జిల్లా కమిటీకి పంపిస్తారని వెల్లడించారు. అనంతరం అర్హులు ఎంపిక చేసుకున్న రుణాలకు సంబంధించిన శిక్షణను అందజేస్తారని తెలిపారు. ఈ పథకంపై ప్రచారం కల్పించి అర్హులకు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, ఆర్డీవో రాధాబాయి, డీఆర్‌డీవో శేషాద్రి, మున్సిపల్ కమి షనర్లు సమ్మయ్య, అన్వేష్, పరిశ్రమల శాఖ జీఎం హనుమంతు, మైనార్టీ వెల్ఫేర్ అధికారి భారతి, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహన్‌రావు, జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
అర్హులందరికీ అవకాశం కల్పించాలి
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా