సిరిసిల్లటౌన్: సంక్షోభాన్ని అధిగమించే దశలో ఉన్న సిరిసిల్ల వస్త్రపరిశ్రమపై సెస్ పాలకవర్గం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని పరిశ్రమ, అనుబంధ రంగాల జేఏసీ ప్రతినిధులు కోరారు. సిరిసిల్ల చేనేత, వస్త్రవ్యాపార సంఘం భవనంలో ఆదివారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా నాలుగు రోజులుగా బ్యాక్‌బిల్లింగ్ సాకుతో పట్టణంలో 250 విద్యుత్ కనెక్షన్లు తొలగించారన్నారు. సెస్ మనుగడ వస్త్రపరిశ్రమపై ఉందన్న విషయాన్ని విస్మరించొద్దన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో విద్యుత్ సబ్సిడీ బి ల్లులు రూ.60కోట్లకు పైగా ఉన్నా ఏనాడూ ప్రభుత్వాన్ని సెస్ పాలకవర్గం అడుగలేదన్నారు. ఇప్పటికై నా సెస్ పాలకవర్గం తమ పద్ధతి మార్చుకో వాలని లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. జేఏసీ ముఖ్య నాయకులు తాటిపాముల దామోదర్, పంతం రవి, ఆడెపు భాస్కర్, ఆంకారపు రవి, గౌడ రాజు, బండారి అశోక్, ఏనుగుల ఎల్లప్ప, దూడం శంకర్, గోవిందు రవి, సామల అశోక్, మండల బాలరాజు పాల్గొన్నారు.
వస్త్రపరిశ్రమ జేఏసీ ప్రతినిధులు