● అసెంబ్లీలో వేములవాడ ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వవిప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. అసెంబ్లీలో గురువారం మాట్లాడారు. వేములవాడలో పోలీస్‌శాఖ బలోపేతానికి నిధులు కేటాయించాలని కోరారు. మహిళల భద్రతను పెంచేందుకు వేములవాడలో మహిళా పోలీస్‌స్టేషన్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వేములవాడ అర్బన్ మండలానికి పోలీస్‌స్టేషన్ మంజూరు చేయాలని, రుద్రంగిలో ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గంలో మోహన్‌రావుపేట నుంచి ఈదులలింగంపేట వరకు డబుల్ రోడ్డు, తాండ్రియాల నుంచి పసునూరు మీదుగా కొత్తగా రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.