సిరిసిల్ల/కోనరావుపేట/గంభీరావుపేట: కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోందని, పౌరుల హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ అవీజ్ కోరారు. కోనరావుపేట, గంభీరావుపేట మండల కేంద్రాల్లో శుక్రవారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పార్టీ మండలాల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్‌పాషా, హమీద్, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌లు కచ్చకాయల ఎల్లయ్య, కొమిరిశెట్టి విజయ, వైస్ చైర్మన్‌లు తాళ్లపెల్లి ప్రభాకర్, అంజిరెడ్డి, మండల కో–ఆర్డినేటర్ వెంకటస్వామి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ప్రజలకు వివరించాలి
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పాదయాత్రలు చేస్తూ ‘జై బాపూ.. జైభీమ్.. జై సంవిధాన్’ లక్ష్యం నెరవేర్చాలని ఏఐసీసీ కోఆర్డినేటర్ అవీజ్ కోరారు. సిరిసిల్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తుందని, వారి చర్యలను ప్రజలకు వివరించాలన్నారు. 18 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను వివరించాలని కోరారు. బీఆర్‌ఎస్, బీజేపీలు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, నాయకులు ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, సూర దేవరాజు, ఆడెపు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
● కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ అవీజ్


