
అర్చకుల సమస్యలు పరిష్కరించండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధూపదీప నైవేద్య అర్చకుల సంఘం నాయకులు మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి శ్రీధర్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం తిమ్మాపూర్ పీఏసీఎస్ వైస్ చైర్మర్ బుగ్గ కృష్ణమూర్తిశర్మ మాట్లాడుతూ ఆలయాల్లో పూజలు చేసే ధూపదీప నైవేద్య అర్చకులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నార అన్నారు. తమ సమస్యల పరిష్కారంపై మంత్రి శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ధూపదీప నైవేద్య అర్చకుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాచర్ల పార్థసారధిశర్మ, ప్రధాన కార్యదర్శి పరాంకుశం రమేశ్, కోశాధికారి కేవీఆర్ వెంకటారమణాచార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ గొంగళ్ల రవికుమార్, ప్రచార కార్యదర్శి చర్లపల్లి సీతారాములుశర్మ, గౌరవ సలహాదారు పారు నంది ఆంజనేయశర్మ తదితరులు ఉన్నారు.