● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎన్నికల వరకే రాజకీయాలు అని.. అభివృద్ధే తమ లక్ష్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రూ.5లక్షల ఎంపీ నిధులతో మంజూరైన సీసీ రోడ్డు పనులకు గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ ఎంపీ బండి సంజయ్‌కుమార్ సహకారంతో గ్రామాల్లో మౌలిక వసతులు, కులసంఘాల భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఎల్లారెడ్డిపేట మండలాన్ని అన్ని రంగాల్లో కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు కోనేటి సాయిలు, పార్టీ మండలాధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శులు మద్దుల బుగ్గారెడ్డి, బందారపు లక్ష్మారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి, నాయకులు రాగుల గాల్‌రెడ్డి, చల్ల సత్యంరెడ్డి, కిరణ్‌నాయక్, నంది నరేశ్, దుంపెన స్రవంతి పాల్గొన్నారు.
పనిచేసే వారికి గుర్తింపు
పార్టీ బలోపేతానికి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. మండలంలోని నారాయణపూర్‌కు చెందిన కోనేటి సాయిలు బీజేపీ ఎస్టీ సెల్ ఏకలవ్య జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న సందర్భంగా సన్మానించారు. గోపి మాట్లాడుతూ సాయిలు సేవలను గుర్తించి పార్టీ జిల్లా నాయకత్వ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
ఇంటికే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు
సిరిసిల్లటౌన్/వేములవాడరూరల్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతారాముల తలంబ్రాలను భక్తుల ఇంటికే ఆర్టీసీ కార్గో ద్వారా అందిస్తున్నట్లు కార్గో ఏటీఎం రామారావు తెలిపారు. కార్గో సేవల పోస్టర్లను గురువారం సిరిసిల్ల, వేములవాడల్లో ఆవిష్కరించారు. 91542 98576, 91542 98577, 949244889లలో బుకింగ్ చేసుకోవాలని కోరారు. కార్గో రీజినల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ రాజు, శేఖర్, శ్రీనివాస్ ఉన్నారు.
3న ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన
సిరిసిల్లటౌన్: జిల్లాలో ఏప్రిల్ 3న ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటించనున్నట్లు గురువారం ప్రకటనలో తెలిపారు. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబునాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్ల శంకర్, రేణికుంట ప్రవీణ్ వేములవాడకు రానున్నట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.
29న ఉగాది కవి సమ్మేళనం
సిరిసిల్లకల్చరల్: ఉగాది పండుగ సందర్భంగా ఈనెల 29న కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు మానేరు రచయితల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎలగొండ రవి ప్రకటనలో తెలిపా రు. సినారె స్మారక కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించే కవి సమ్మేళనానికి గ్రంథాలయసంస్థ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యానారాయణ, కవులు డాక్టర్ కందేపి రాణీప్రసాద్, జూకంటి జగన్నాథం అతిథులుగా హాజరవుతున్నారని పేర్కొన్నారు. పెద్దసంఖ్యలో కవులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
‘ఉపాధి’లో అక్రమాలు
● సామాజిక తనిఖీతో వెలుగులోకి..
● సొమ్ము రికవరీకి ఆదేశాలు
చందుర్తి(వేములవాడ): ఉపాధిహామీ పథకంలో అక్రమాలు వెలుగుచూశాయి. చందుర్తి మండల పరిషత్‌లో గురువారం నిర్వహించిన సామాజిక తనిఖీలో స్వాహాపర్వం వెలుగుచూసింది. మూడు గంటలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది. రూ.37,30,117 విలువైన పనులు చేపట్టగా.. రూ.55,392 అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. అక్రమాలకు పాల్ప డిన రూ.55,392లతోపాటు రూ.11వేలు జరి మానా విధించినట్లు వెల్లడించారు. డీఆర్‌డీఏ పీడీ శేషాద్రి, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి అరుణ్‌రెడ్డి, అంబుడ్స్‌మెన్ రాకేశ్, చందుర్తి ఎంపీడీవో ప్రదీప్‌కుమార్, ఉపాధిహామీ ఏపీవో రాజయ్య, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్‌అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు