
ఏసీపీ కొడుక్కు 80వ ర్యాంకు..
● ఇప్పటికే అగ్రికల్చర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పాలకుర్తి సందీప్
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ సీసీఎస్ ఏసీపీ పాలకుర్తి కాశయ్య కుమారుడు పాలకుర్తి సందీప్ గ్రూప్–1 ఫలితాల్లో 80వ ర్యాంకు సాధించాడు. కరీంనగర్‌లో ఇంటర్ వరకు చదివి, తమిళనాడులో అగ్రికల్చర్ బీఎస్సీ, రాజేంద్రనగర్‌లోని జయశంకర్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసిన సందీప్ అగ్రికల్చర్ ఆఫీసర్‌గా ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ఏవోగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉన్నత ఉద్యోగం సాధించాలనే తపనతో తల్లిదండ్రులు భాగ్యలక్ష్మీ, కాశయ్య సూచనలు, ప్రోత్సాహంతో గ్రూప్–1 ఉద్యోగానికి ప్రిపేర్ అయి విడుదలైన ఫలితాల్లో 80 ర్యాంకు సాధించాడు. సందీప్ సోదరుడు సంజయ్ అమెరికాలో పీహెచ్‌డీ చేస్తుండగా.. సోదరి సింధు చైన్నెలో ఎంబీబీఎస్ హౌజ్ సర్జన్ చేస్తోంది. సందీప్‌కు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.