బస్టాండ్‌లో పోలీసుల తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌లో పోలీసుల తనిఖీలు

Published Tue, Mar 25 2025 12:09 AM | Last Updated on Tue, Mar 25 2025 12:08 AM

సిరిసిల్ల: అది సిరిసిల్ల పాతబస్టాండ్‌.. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో సికింద్రాబాద్‌కు వెళ్లే మొదటి బస్సు అప్పుడే చేరుకుంది. వెంటనే అప్రమత్తమైన మహిళా కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుల్‌, ఎస్సై ఆ బస్సులోకి ప్రవేశించి ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆధార్‌కార్డును చెక్‌ చేస్తూ వివరాలు ఆరా తీశారు. ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారంటూ ప్రశ్నలు సంధించి వివరాలు సేకరించారు. తమ డిమాండ్ల సాధనకు ఆశవర్కర్లు ‘చలో అసెంబ్లీ’ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. చివరికి 16 మంది ఆశకార్యకర్తలను సిరిసిల్ల ఠాణాకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement