● పవర్‌లూమ్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ
సిరిసిల్ల: నేతకార్మికులకు రావాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీ అందించాలని పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు కోడం రమణ కోరారు. జిల్లా కేంద్రంలోని బీవైనగర్ అమృత్‌లాల్ కార్మిక భవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. 2023లో కార్మికులు నేసిన బతుకమ్మ చీరల 10 శాతం యారన్ సబ్సిడీ పెండింగ్‌లో ఉందన్నారు. ప్రస్తుతం వస్త్రపరిశ్రమ సరిగ్గా నడువక కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారని, వెంటనే యారన్ సబ్సిడీ డబ్బులు విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణాధ్యక్షుడు నక్క దేవదాస్ మాట్లాడుతూ వస్త్రపరిశ్రమ సమస్యలపై అధికారులు కార్మికులతో మాట్లాడడం లేదని యజమానులతో మాట్లాడి కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అన్నల్‌దాస్ గణేశ్, సూరం పద్మ, సిరిమల్ల సత్యం, ఒగ్గు గణేశ్, బింగి సంపత్, సందుపట్ల పోచమల్లు పాల్గొన్నారు.