
అగ్నివీర్‌కు తిమ్మాపూర్ యువకుడి ఎంపిక
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లతిమ్మాపూర్‌కు చెందిన పల్లె దినేశ్‌గౌడ్ అగ్నివీర్‌కు ఎంపికయ్యాడు. పల్లె మమత– నాంపల్లి దంపతుల కుమారుడు దినేశ్‌గౌడ్. నాంపల్లి ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డిగ్రీ చదివిన దినేశ్‌గౌడ్ మొదటి ప్రయత్నంలోనే ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. యు వకుడిని ఏఎంసీ మాజీ చైర్మన్ కొండ రమేశ్‌గౌడ్, నాయకులు బుర్ర ఉపేందర్‌గౌడ్, గరుగుల శ్రీనివాస్‌గౌడ్, దాస్‌గౌడ్ సన్మానించారు.
‘నవోదయ’ విజేతలకు సన్మానం
సిరిసిల్ల ఎడ్యుకేషన్: నవోదయ పాఠశాలల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించి పరీక్షలో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం సిరిసిల్లలో సన్మానించారు. జ్ఞాపికతోపాటు నగదు ప్రోత్సాహకంగా అందజేశారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పర్కాల రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నవోదయలో సీటు సాధించడం హర్షణీయమన్నారు. వీర్నపల్లి మండలం గర్జనపల్లితండాకు చెందిన భూక్య శ్రీనితరాథోడ్, వేములవాడ మండలం హన్మాజీపేటకు చెందిన నగరం గాయత్రి నవోదయ సీట్లు సాధించడంతో అభినందించారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తిరుమల జగన్నాథాచారి, గుగులోత్ తిరుపతిజాదవ్‌లను సన్మానించారు. ఉపాధ్యాయులు జంగిటి రాజు, గుండమనేని మహేందర్‌రావు, పొలాస మల్లేశం, కోటగిరి లక్ష్మణ్, ఆడెపు శివకుమార్, గాలిపెల్లి సంతోష్ పాల్గొన్నారు.
నియామకం
బోయినపల్లి(మానకొండూర్): కొత్తపేటకు చెందిన మానాల నారాయణ మండల కాంగ్రెస్ సేవాదల్ విభాగం అధ్యక్షుడిగా నియమితు లయ్యారు. ఈమేరకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోమవారం నియామకపత్రం అందజేశారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే సత్యం, కాంగ్రెస్ నాయకులకు నారాయణ కృతజ్ఞతలు తెలిపారు.

అగ్నివీర్‌కు తిమ్మాపూర్ యువకుడి ఎంపిక

అగ్నివీర్‌కు తిమ్మాపూర్ యువకుడి ఎంపిక