తంగళ్లపల్లి(సిరిసిల్ల): తమకు ఇన్నాళ్లు పాఠశాలలో రుచికరమైన మధ్యాహ్న భోజనం వండి పెట్టిన అమ్మలకు మండలంలోని జిల్లెల్ల ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థులు కృతజ్ఞతను చాటుకున్నారు. తమకు ఆరో తరగతి నుంచి రుచికరమైన భోజనం వండి పెడుతున్న మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు మంగళవారం చీరలు బహూకరించి తమ ప్రేమను చాటారు. విద్యార్థులు మాట్లాడుతూ ఐదేళ్లుగా తమను కన్నతల్లి లాగా చూసుకొని కడుపునిండా అన్నంపెట్టారని కొనియాడారు. అనంతరం ఆఫీస్ సబార్డినేట్ సంతోష్‌కు కూడా బహుమతులు అందజేశారు. విద్యార్థులను పాఠశాల హెచ్‌ఎం జోగినపల్లి అనురాధ అభినందించారు.