సిరిసిల్ల: జిల్లాలో ఎనిమిది మందికి కారుణ్య నియామకపత్రాలను కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అందించారు. జెడ్పీ ఉద్యోగులు ఇటీవల అకాల మరణంతో వారి కుటుంబ సభ్యులకు వారసత్వంగా కారుణ్య పథకంలో నియమించారు. ఈమేరకు కర్ర సాత్విక, తాటికొండ శ్రీజ, అనగందుల వెంకటేశ్, ఆరుట్ల/మధునాల స్నేహ, ఎస్.వెన్నెల, తీగల మంజులత, మల్లారపు సహజ, వొల్లాద్రి రక్షితకు నియామకపత్రాలను అందించారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జెడ్పీ సీఈవో వినోద్, డీఆర్‌డీవో శేషాద్రి పాల్గొన్నారు.
టీబీ నియంత్రణ అందరి బాధ్యత
సిరిసిల్లటౌన్: జిల్లాలో క్షయ(టీబీ) నియంత్రణలో పౌరులు బాధ్యతగా పాల్గొనాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆస్పపత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీబీ రహిత గ్రామాలుగా శివంగాలపల్లి, అనంతపల్లి, రామన్నపేట, కంచర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. డీఎంహెచ్‌వో రజిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
పది పరీక్షలు తనిఖీ
సిరిసిల్లఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్ర పరిశీలకుడు రాజీవ్ పలు కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో 35 పరీక్షా కేంద్రాల్లో 6,767 మంది విద్యార్థులకు 6,750 మంది హాజరైనట్లు డీఈవో జనార్దన్‌రావు తెలిపారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సిరిసిల్లలోని విజ్ఞానవర్ధిని హైస్కూల్, డీఈవో వేములవాడలోని హంసిని డీజీ హైస్కూల్, చైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూల్, గౌతమ్ హైస్కూల్, వేములవాడ బాలికల హైస్కూల్, కోనరావుపేట మండలం ధర్మారం హైస్కూలోని కేంద్రాలను తనిఖీ చేశారు.