
రైస్‌మిల్లులో గంజాయి మొక్కలు
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): కాట్నపల్లి గ్రామ శివారులోని ఓ రైస్‌మిల్లులో గంజాయి మొక్కల పెంపకం సోమవారం బయటపడింది. సమాచారం అందుకున్న ఎస్సై శ్రావణ్‌కుమార్ రైస్‌మిల్లుకు చేరుకుని గంజాయి మొక్కలు పరిశీలించారు. ఆ సమయంలో యాజమాన్యం, కార్మికులు ఎవరూ అందుబాటులో లేరు. యాజమాన్యానికి సమా చారం ఇచ్చినా స్పందించలేదు. రాత్రివరకూ విచారణ చేపట్టి.. చవరకు కాట్నపల్లి గ్రామానికి చెందిన మేకల పవన్‌కల్యాన్, బిహార్‌కు చెందిన లాల్ అరోబిహార్‌తోపాటు కాట్నపల్లికి చెందిన రైస్‌మిల్లు యజమాని మట్ట శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఏసీపీ కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.