క్రీడలతో ఒత్తిడిని అధిగమించొచ్చు | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో ఒత్తిడిని అధిగమించొచ్చు

Published Thu, Mar 27 2025 12:19 AM | Last Updated on Thu, Mar 27 2025 12:19 AM

క్రీడ

క్రీడలతో ఒత్తిడిని అధిగమించొచ్చు

● ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి ● డీఎస్పీ కార్యాలయంలో షటిల్‌ కోర్టు ప్రారంభం

వేములవాడ: విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే పోలీసులు క్రీడలపై దృష్టి సారిస్తే విధుల్లోని ఒత్తిడిని అధిగమించవచ్చని ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి పేర్కొన్నారు. డీఎస్పీ కార్యాలయంలో షటిల్‌కోర్టును బుధవారం ప్రారంభించారు. అనంతరం సీఐలు, ఎస్సైలతో షటిల్‌ ఆడారు. సీఐలు వీరప్రసాద్‌, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, ఎస్సైలు మారుతి, రమేశ్‌, అంజయ్య, అశోక్‌, పృథ్వీధర్‌గౌడ్‌, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భారత నౌకాదళానికి ఎంపిక

కోనరావుపేట(వేములవాడ): మండలంలోని కొండాపూర్‌కు చెందిన గొల్లపల్లి వివేక్‌వర్ధన్‌ భారత నౌకాదళానికి ఎంపికయ్యాడు. గ్రామానికి చెందిన గొల్లపల్లి దేవరాజుగౌడ్‌–లత దంపతుల కుమారుడు హైదరాబాద్‌లో డీగ్రీ మూడో సంవత్సరం చదువుతూ పరీక్ష రాశాడు. భారత నౌకాదళంలో ఎస్‌ఎస్‌ఆర్‌గా ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తండ్రి దేవరాజు గ్రామంలో గీతకార్మికునిగా పనిచేస్తుండగా తల్లి లత బీడీ కార్మికురాలు. వివేక్‌వర్ధన్‌ భారత నౌకాదళానికి ఎంపిక కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కాయకల్ప బృందం వైద్యులు మంజుల, నర్సింగ్‌ అధికారిణి శ్రావణి సూచించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వసతులు, రికార్డులు, పరిసరాలు, రోగుల రిజిష్టర్‌లను పరిశీలించారు. వారు మాట్లాడుతూ ఆస్పత్రిలో సాదారణ ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ఫార్మసిస్ట్‌ శ్వేత, జూనియర్‌ అసిస్టెంట్‌ లిఖిత, వైద్యులు అజయ్‌కుమార్‌, ప్రదీప్‌కుమార్‌, రఘు, సూపరింటెండెంట్‌ బాబు పాల్గొన్నారు.

ప్యాక్స్‌ చైర్మన్లను కొనసాగించాలని కోర్టు ఉత్తర్వులు

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండలంలోని గాలిపల్లి, ఇల్లంతకుంట ప్యాక్స్‌ పాలకవర్గాన్ని కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇల్లంతకుంట, గాలిపల్లి ప్యాక్స్‌ పాలకవర్గం పదవీకాలం ముగిసిందని, రద్దు చేస్తూ ఈనెల 7న జిల్లా సహకారసంఘం వారు స్పెషలాఫీసర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సవాల్‌ చేస్తూ ఇల్లంతకుంట, గాలిపల్లి పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించింది. ఈమేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కాపీని ఇల్లంతకుంట ప్యాక్స్‌ మాజీ చైర్మన్‌ తిరుపతిరెడ్డి బుధవారం డీసీవో రామకృష్ణకు అందజేశారు. దీనిపై జిల్లా కో–ఆపరేటీవ్‌ అధికారి రామకృష్ణను వివరణ కోరగా తమ కార్యాలయానికి హైకోర్టు ప్రతి అందలేదని తెలిపారు.

టీకాల కేంద్రం తనిఖీ

వేములవాడరూరల్‌: వేములవాడ మండలం మర్రిపల్లి ఆరోగ్య ఉపకేంద్రంలో వ్యాధి నిరోధక టీకాల కేంద్రాన్ని డీఎంహెచ్‌వో రజిత బుధవారం తనిఖీ చేశారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్ల వరకు ఇచ్చే వ్యాధి నిరోధక టీకాల వివరాలు, ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలపై సిబ్బందికి వివరించారు. డీఐవో డాక్టర్‌ సంపత్‌కుమార్‌, డీడీఎం కార్తీక్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

క్రీడలతో ఒత్తిడిని   అధిగమించొచ్చు1
1/4

క్రీడలతో ఒత్తిడిని అధిగమించొచ్చు

క్రీడలతో ఒత్తిడిని   అధిగమించొచ్చు2
2/4

క్రీడలతో ఒత్తిడిని అధిగమించొచ్చు

క్రీడలతో ఒత్తిడిని   అధిగమించొచ్చు3
3/4

క్రీడలతో ఒత్తిడిని అధిగమించొచ్చు

క్రీడలతో ఒత్తిడిని   అధిగమించొచ్చు4
4/4

క్రీడలతో ఒత్తిడిని అధిగమించొచ్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement