● అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదంపై హర్షం ● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు
సిరిసిల్ల: విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలకు 29 నుంచి 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో ఆమోదం పొందడంపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో మంగళవారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. హన్మాండ్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని కోరారు. చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ శ్రీనివాస్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ఆమోదించకుంటే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపడతామని హెచ్చరించారు. అనం తరం స్వీట్లు పంచి, టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. నాయకులు తడక కమలాకర్, బొప్ప దేవయ్య, చొక్కాల రాముముదిరాజ్, గోలి వెంకటరమణ, జగ్గాని మల్లేశ్‌యాదవ్, సమ్మెట రవి, ఇల్లంతకుంట తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లలో శాసీ్త్రయతను పాటించాలి
బీసీ రిజర్వేషన్లలో శాసీ్త్రయతను పాటించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిత సంఘం అధ్యక్షుడు పొలాస నరేందర్ కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఆమోదించడంపై హర్షం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని కోరారు.